బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర లో నటించిన లేటెస్ట్ మూవీ భక్షక్. పులకిత్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా లో సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ మరియు సాయి తమ్‌హంకర్ కీలక పాత్రలు పోషించారు.కంటెంట్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో షారుక్ ఖాన్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై భక్షక్ మూవీ ను నిర్మించారు.. టీజర్స్ మరియు ట్రైలర్లతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. శుక్రవారం (ఫిబ్రవరి 09) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో భక్షక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని చిత్రబృందంతో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
కాగా నిజ జీవితం లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని చేసుకుని భక్షక్ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాత షారుక్ ఖాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.భక్షక్ కథ విషయానికి వస్తే.. వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు వరుసగా అత్యాచారానికి గురవుతుంటారు. ఒక లోకల్ రౌడీ (ఆదిత్య శ్రీ వాస్తవ) ఈ మాఫియాను నిర్వహిస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వైశాలి (భూమి పడ్నేకర్) వాటిని బయట పెట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటుంది. మరి బాలికలు, మహిళలల పై జరుగుతున్న నేరాలను వైశాలి ఎలా గుర్తించింది..ఆధారాలతో సహా వాటిని ఎలా వెలుగు లోకి తెచ్చింది.. ఈ నేపథ్యం లో వైశాలి ఎలాంటి సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ఈ మూవీ ప్రధాన కథ..
This story needs to be told and heard, and Vaishali Singh is doing her part 📹#Bhakshak a film inspired by true events, now streaming only on Netflix! pic.twitter.com/BbPKjywun7
— Netflix India (@NetflixIndia) February 9, 2024