kissing History: ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త అధ్యయనంలో ముద్దు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. పలు నివేదికల ప్రకారం.. సుమారు 20 మిలియన్ సంవత్సరాల క్రితం మొట్ట మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నారని పరిశోధకులు కనుగొన్నారు. తర్వాత వాళ్లు ముద్దు పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకున్నారని వెల్లడించారు. మానవులకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు అంతరించిపోయిన జాతి నియాండర్తల్‌లు కూడా ముద్దు పెట్టుకున్నాయని తాజా పరిశోధనలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు.
READ ALSO: YV Subba Reddy: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిమాణం.. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్ బృందం..
ముద్దు ముచ్చట..
ఈ సందర్భంగా పలువురు పరిశోధకులు మాట్లాడుతూ.. మొదటగా వివిధ కోతులు, కోతుల కుటుంబ వృక్షాన్ని పరిశీలించాం. ఏ జంతువులు మొదటిసారి ముద్దు పెట్టుకున్నాయో, ఈ అలవాటు ఎంత పాతదో తెలుసుకోవడానికి ఈ విధమైన ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. సుమారుగా 215, 169 మిలియన్ సంవత్సరాల క్రితం కోతుల పూర్వీకులలో ముద్దు లాంటి ప్రవర్తన ఉందని తమ పరిశోధనలలో తేలింది. కాలక్రమేణా పరిస్థితులు మారాయి, కానీ ఈ అలవాటు కొనసాగిందని అన్నారు. నేటికీ చింపాంజీలు, బోనోబోలు, ఒరంగుటాన్లు వంటి కోతుల జాతులు ఒకదానికొకటి ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుందని వివరించారు. “ముద్దును ఇంత విస్తృత దృక్కోణం నుంచి అర్థం చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి” అని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ మాటిల్డా బ్రిండిల్ అన్నారు .
పరిశోధకులు మాట్లాడుతూ.. నియాండర్తల్‌లకు, మానవులకు ఒకేలాంటి నోటి బ్యాక్టీరియా ఉందని మునుపటి పరిశోధనలు వెల్లడించాయి. కాబట్టి ఈ పరిశోధనలో నియాండర్తల్‌లను తరచుగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ బ్యా్క్టీరియా అనేది ఈ జీవాలకు మనుషులకు మధ్య కొంత సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుందని పరిశోధకులు తెలిపారు. మానవులు ఎలాగైతే పిల్లలను కలిగి ఉన్నారో, నియాండర్తల్ జీవులు కూడా అలాగే పిల్లలను కలిగి ఉన్నాయని చాలా మంది పరిశోధకులు నమ్ముతారు. అందువల్ల ఈ ముద్దు పెట్టుకోవడం కూడా నియాండర్తల్ జీవులలో ఒక సాధారణ భాగంగా ఉండేదని విశ్వసిస్తున్నారు.
జంతువులలో ముద్దు..
జంతువులలో ముద్దు పెట్టుకోవడాన్ని గుర్తించడం అత్యంత కష్టమైన పనిగా పరిశోధకులు వెల్లడించారు. జంతువులలో ముద్దు లాంటి కదలికలను కచ్చితంగా గుర్తించడానికి సవాలును ఎదుర్కొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే కొన్నిసార్లు జంతువులు నోటిని తాకుతాయి, కానీ అది ముద్దు కాదని అన్నారు. ఈక్రమంలో పరిశోధకులు జంతువుల ముద్దుకు ఒక సరళమైన నిర్వచనాన్ని సృష్టించారు .. ” ఆహారం డెలివరీ చేయని సున్నితమైన, నిశ్శబ్ద నోటి నుంచి నోటికి పరిచయం” జంతువుల ముద్దుగా పేర్కొన్నారు. ఈ నిర్వచనం ఆధారంగా, వారు అన్ని కోతి జాతులను అధ్యయనం చేశారు. ఈ ప్రవర్తన చింపాంజీలు, బోనోబోలు, ఒరంగుటాన్లలో స్పష్టంగా కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. “ఇటువంటి ప్రవర్తనలు ఎముకలలో కనిపించవు, కానీ ఆధునిక జ్ఞానం, విజ్ఞాన శాస్త్రాన్ని కలపడం ద్వారా, మన ప్రాచీన పూర్వీకులు ఏమి చేస్తున్నారో మనం ఊహించవచ్చు” అని ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ స్టువర్ట్ వెస్ట్ చెప్పారు.
ముద్దు పెట్టుకోవడం అనేది మనం పుట్టుకతోనే కలిగి ఉన్నదా, లేక అది కేవలం ఒక సంప్రదాయమా? ప్రపంచంలోని 46 శాతం మానవ సంస్కృతులలో మాత్రమే ముద్దు పెట్టుకుంటున్నట్లు ఈ అధ్యయనం చివరి భాగం వెల్లడించింది. దీని అర్థం కొన్ని సంస్కృతులలో ముద్దు చాలా సాధారణం అయినప్పటికీ, మరికొన్నింటిలో అది అర్థవంతంగా ఉండదు. “ముద్దు పెట్టుకోవడం సర్వసాధారణమని మనం అనుకుంటాం, కానీ సామాజిక అధ్యయనాలు అలా కాదని చూపిస్తున్నాయి” అని ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కేథరీన్ టాల్‌బోట్ తెలిపారు.
READ ALSO: Kashmir Times: ‘కాశ్మీర్ టైమ్స్’ ఆఫీస్‌పై SIA రైడ్స్.. ఏకే-47 బుల్లెట్లు, పిస్టల్ సీజ్