Tahawwur Rana: ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాను భారత్‌కు అప్పగించాలని అమెరికా కోర్టు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది. 2020 జూన్ 10న రాణాను అప్పగించాలని భారత్.. అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారత్ చేసిన అభ్యర్థనకు బైడెన్ సర్కారు ఇంతకుముందే ఆమోదం తెలపగా.. తాజాగా కోర్టు కూడా రాణాను అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. ముంబయి పేలుళ్లలో రాణా పాత్ర ఉందని భారత్ చేసిన అభ్యర్థన మేరకు అమెరికా అతడిని అరెస్ట్ చేసింది.
2008లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన 26/11 దాడుల్లో అతని పాత్రపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ జరుపుతోంది. ఈ దాడుల్లో అతని పాత్ర ఉన్నందుకు భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు అతన్ని అమెరికాలో అరెస్టు చేశారు. దౌత్య మార్గాల ద్వారా అతడిని భారత్‌కు రప్పించేందుకు చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. కోర్టు విచారణల సందర్భంగా, రాణాకు తన చిన్ననాటి స్నేహితుడు పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి లష్కరే తోయిబాతో సంబంధం ఉందనే విషయం రాణాకు ముందే తెలుసని, హెడ్లీకి సహాయం చేయడం, అతని కార్యకలాపాలకు రక్షణ కల్పించడం ద్వారా అతను ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నాడని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వాదించారు. రాణాకు హెడ్లీ సమావేశాలు, చర్చించిన అంశాలు, కొన్ని లక్ష్యాలతో సహా దాడుల ప్రణాళిక గురించి తెలుసని మెరికా న్యాయవాదులు కోర్టులో వాదించారు. రాణాకు ముంబయి దాడులకు సంబంధించిన ప్రణాళిక ముందే తెలుసని నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి రాణాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించారు. రాణా కుట్రలో భాగమేనని, అతను ఉగ్రవాద చర్యకు పాల్పడే గంభీరమైన నేరానికి పాల్పడి ఉండవచ్చని అమెరికా ప్రభుత్వం నొక్కి చెప్పింది. మరోవైపు రాణా తరపు న్యాయవాది అప్పగింతను వ్యతిరేకించారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Read Also: Mahinda Rajapaksa: మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తేసిన శ్రీలంక కోర్టు
2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు అమెరికన్లతో సహా మొత్తం 166 మంది మరణించారు. ఇందులో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు 60 గంటలకు పైగా ముట్టడి చేశారు. ముంబైలోని ప్రముఖ, ముఖ్యమైన ప్రదేశాలలో ప్రజలను దాడి చేసి చంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాలో పర్యటించనుండగా.. దాదాపు నెల ముందు ఈ ఉత్తర్వులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా అగ్రరాజ్యం పేర్కొంది. 2008 ముంబయి ఉగ్రదాడుల దోషులకు శిక్ష పడాలని పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!