Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan: ఇండియన్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘రామాయణం’. సుమారు రూ.4,800 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ భారీ చర్చకు దారి తీస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ స్కేల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు ఈ సినిమా తారాగణం పారితోషికాలపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇందులో ఒక స్టార్ నటుడు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా చేసిన నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం రణబీర్ కపూర్ మొత్తం రూ.150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒక్కో భాగానికి రూ.75 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.
అయితే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదని నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెప్పినట్లు స్వయంగా వివేక్ వెల్లడించారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు రావాల్సిన మొత్తం పారితోషికాన్ని క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తాను ఈ సినిమాని ఒక సినిమా కోణంలో కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నానని వివేక్ ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడమే తనకు పెద్ద గౌరవమని, పారితోషికం కంటే సేవా కార్యక్రమానికి ఆ నిధులు వెళ్తే మరింత సంతోషంగా ఉంటుందని చెప్పారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 నవంబర్ 6న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్‌కు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ