దేశంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. అన్నాదమ్ముల మధ్య.. తల్లిదండ్రులు.. పిల్లల మధ్య బంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. కుటుంబాల్లో మునుపటి అనురాగాలు నేడు కనుమరుగైపోతున్నాయి.
అతడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సిన వాడు దుర్మార్గంగా ఆలోచించాడు. తన ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు కుమార్తెలు వస్తే.. సంతోషించాల్సిన వాడు కిరాతకంగా మారాడు. ఇద్దరు ఆడ శిశువులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.