UPI new Service Update: దేశంలో యూపీఏ పేమెంట్లను మరింత వేగవంతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రజలకు కొత్త సదుపాయాన్ని అందించింది. 10 జనవరి 2024 నుండి ఆసుపత్రులు, విద్యా సేవలకు యూపీఐ లావాదేవీల పరిమితి పెంచబడింది. ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో ఆసుపత్రులు, విద్యా సేవలలో రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చని ఆదేశించింది. ఇంతకుముందు, ఈ రంగాలలో యూపీఐ చెల్లింపుకు సంబంధించి ప్రజలు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్‌పిసిఐ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యుపిఐ దరఖాస్తులను పరిమితిని పెంచాలని ఆదేశించింది.
Read Also:Yash Birthday: హీరో యశ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి!
గతంలో యూపీఐ పరిమితి రూ.1 లక్ష ఉండగా, ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. ధృవీకరించబడిన వ్యాపారులకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది. వ్యాపారులు యూపీఐని పేమెంట్ మోడ్‌గా ఇంట్రడ్యూస్ చేయడం అవసరం. యూపీఐ ఒక రోజు పరిమితి రూ. 1 లక్షగా నిర్ణయించబడింది. డిసెంబర్ నెలలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీలో ఆర్‌బీఐ యూపీఐ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఈ సదుపాయం Paytm, Google Pay, PhonePe యాప్‌ల వంటి UPI అన్ని సపోర్టింగ్ యాప్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంకుల్లోని ఖాతాదారులకు కూడా ఈ సౌకర్యం కల్పించనున్నారు.
Read Also:Naa Saami Ranga : దుమ్ము దుకాణం అంటున్న నాగార్జున.. కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్..
UPI లావాదేవీల బూమ్
దేశంలో యూపీఐ చెల్లింపులు పెరిగాయి. 2023 నాటికి ఇది 100 బిలియన్లను దాటుతుంది. NPCI విడుదల చేసిన డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో సుమారు 126 కోట్ల UPI చెల్లింపులు జరిగాయి. గత సంవత్సరం 2023లో యూపీఐ చెల్లింపులు 60 శాతం పెరిగాయి.