ఇంకో ఐదు రోజుల్లో ఈ ఏడాది జూలై నెల కాల గర్భంలో కలిసిపోనున్నది. మరికొన్ని రోజుల్లో ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతీ నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్, ఎల్పీజీ ధరల నియమాలలో మార్పులు ఉండవచ్చు. యూపీఐ విషయంలో కూడా అనేక మార్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల నుంచి ఏ నియమాలు మారుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:WI vs AUS: సిక్సుల వర్షం కురిపించిన టిమ్ డేవిడ్.. విండీస్‌పై ఆసీస్ విజయం.. సిరీస్ సొంతం.!
క్రెడిట్ కార్డు రూల్స్
మీరు ఎస్బీఐ కార్డ్ హోల్డర్ అయితే, మీకు పెద్ద షాక్. ఎందుకంటే ఆగస్టు 11 నుంచి, SBI అనేక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందుబాటులో ఉన్న ఉచిత విమాన ప్రమాద బీమా కవర్‌ను నిలిపివేయబోతోంది. ఇప్పటివరకు, SBI, UCO బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, PSB, కరూర్ వైశ్య బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్‌లతో కలిసి కొన్ని ELITE, PRIME కార్డులపై రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల బీమా కవర్‌ను అందించేది.
ఎల్పీజీ ధరలలో మార్పు
ప్రతి నెల లాగే, ఈ నెల కూడా LPG లేదా వాణిజ్య సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చు. జూలై 1న, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలో మార్పు చోటుచేసుకుంది. దానిని రూ.60 తగ్గించారు. వాణిజ్య సిలిండర్ ధర చాలాసార్లు మారిపోయింది. కానీ LPG సిలిండర్ ధర ఇంకా మారలేదు. అటువంటి పరిస్థితిలో, ఆగస్టు 1 నుంచి LPG ధరలో తగ్గింపు ఉంటుందని భావిస్తున్నారు.
Also Read:Gandikota Murder Case: మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. ఎస్పీ ఏం చెప్పారంటే..?
UPI న్యూ రూల్స్
ఆగస్టు 1 నుంచి UPIకి సంబంధించి అనేక కొత్త నియమాలు అమలు కానున్నాయి. మీరు Paytm, PhonePe, GPay లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే, మెరుగైన చెల్లింపు సౌకర్యాలను అందించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనేక నియమాలను మార్చింది. NPCI కొన్ని కొత్త పరిమితులను విధించింది. ఇది మీ చెల్లింపును ప్రభావితం చేయదు, కానీ బ్యాలెన్స్ చెక్, స్టేటస్ రిఫ్రెష్, ఇతర విషయాలపై పరిమితులను విధిస్తుంది.
ఆగస్టు 1 నుంచి UPI యాప్ నుంచి ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి వీలుంటుంది.
మీరు మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే తనిఖీ చేయగలరు.
నెట్‌ఫ్లిక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ వాయిదాల వంటి ఆటోపే లావాదేవీలు ఇప్పుడు కేవలం 3 టైమ్ స్లాట్లలో ప్రాసెస్ చేయబడతాయి. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు మరియు రాత్రి 9.30 తర్వాత.
మీరు ఒక రోజులో 3 సార్లు మాత్రమే విఫలమైన లావాదేవీల స్థితిని తనిఖీ చేచే వీలుంటుంది. ప్రతి చెక్కు మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది.
Also Read:UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి సలహాతో అన్నంలో విషం పెట్టి భర్తను చంపేసిన భార్య
CNG, PNG ధరలో మార్పు
చమురు కంపెనీలు ప్రతి నెలా CNG, PNG ధరలను కూడా మారుస్తాయని తరచుగా వినిపిస్తున్నా.. కానీ ఏప్రిల్ నుంచి ఎటువంటి మార్పు లేదు. CNG-PNG ధరలో చివరి మార్పు ఏప్రిల్ 9న జరిగింది. తరువాత ముంబైలో, CNG రూ. 79.50 / kg, PNG రూ. 49 / unit. ఈ పెరుగుదల ఆరు నెలల్లో నాల్గవసారి చోటుచేసుకుంది.
Also Read:Rajasthan: ప్రొఫెసర్ల వేధింపులకు మరొకరు బలి.. ఉదయపూర్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య
ATF ధరలు
ఆగస్టు 1 నుంచి ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF) ధర కూడా మారవచ్చు. ఎందుకంటే చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG ధరను మాత్రమే కాకుండా ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF ధర) ధరను కూడా నెల మొదటి తేదీన మార్చే అవకాశం ఉంటుంది.