Akshay Kumar Success Story: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఓ ఫేమస్ డైలాగ్ విశేషంగా ప్రచారం పొందింది. పాలు అమ్మిన.. పూలు అమ్మిన.. కష్టపడ్డా.. ఇది విని నవ్వని నెటిజన్ లేడు.. కానీ ఇకపై నవ్వడం ఆపేయండి…. నిజంగానే ఒక ఆయన పాలు అమ్మి నెలకు అక్షరాల రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరు ఆయన.. ఏంటి ఆయన స్టోరీ.. నిజంగానే ఆయన కేవలం పాలు అమ్మడం ద్వారానే నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నాడా? ఇది నిజంగా నిజం.. ఆయన పాలు అమ్మి లక్షలు సంపాదిస్తున్నాడు. పాలతో పాటు నెయ్యి, ఆవు పేడ అమ్మి అదనంగా సంపాదిస్తున్నాడు కూడా.. ఇంతకీ ఆయన కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Glacial Lakes: హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు, ఎప్పుడైనా ముప్పు: తాజా రిపోర్ట్..
హర్యానాలోని సిర్సా జిల్లా రూపవాస్ గ్రామంలో అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా అందరి లాంటి వాడు అయితే ఈ రోజు మనం ఆయన గురించి అస్సలు తెలుసుకునే వాళ్లం కాదు. ఆయన ఎంఎస్సీ చదివాడు. తర్వాత అందరి లాగా ఉద్యోగాల కోసం ఉరుకులు పెట్టాలే. ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబానికి దూరంగా నాలుగు రాళ్లు సంపాదించే బదులు తానే నలుగురికి ఉపాధి చూపించాలని ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా జెవ్లియా డైరీ ఫామ్ అనేది తన గ్రామంలో స్టార్ట్ చేశాడు. అప్పటికే వాళ్ల కుటుంబం గేదెలను పెంచేది. దీంతో వాళ్ల కింద వీళ్ల కింద పని చేయడం అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సాంప్రదాయ పనినే తన వృత్తిగా ఎంచుకొని ముందుకు దూసుకుపోయాడు మనోడు.
ఎనిమిది గేదెలతో ప్రారంభమైన 370 చేరుకున్నాడు..
తను ఆరంభంలో కేవలం ఎనిమిది గేదెలతో డైరీ ఫామ్ ప్రారంభించాడు. ఇప్పుడు మనోడి డైరీ ఫామ్‌లో 370 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయన ప్రతి నెలా రూ.25 లక్షల విలువైన పాలను అమ్ముతున్నట్లు చెప్పాడు. నెయ్యి, ఆవు పేడ ఎరువు ద్వారా వచ్చే రాబడి వేరు. అజయ్ 14 మందికి శాశ్వత ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు. మనోడి సక్సెస్ స్టోరీ గ్రామానికే పరిమితం కాలేదు.. జిల్లా మొత్తం వినిపిస్తోంది. మనోడు మాట్లాడుతూ.. ‘2017లో కేవలం 8 గేదెలతో పాల వ్యాపారాన్ని ప్రారంభించాం. నేడు 370 గేదెలకు తమ వ్యాపారాన్ని వృద్ధి చేశాం. వీటిలో 180 గేదెలు క్రమం తప్పకుండా పాలు ఇస్తాయి. శీతాకాలంలో పాలు ఎక్కువగా ఉంటాయి, వేసవిలో తక్కువగా ఉంటాయి. రోజుకు 1300 లీటర్ల పాలు అమ్ముతాం. సిర్సా నగరంలో ఇద్దరు – ముగ్గురు పెద్ద పాల సరఫరాదారులు తమ వినియోగదారులు.. నేను స్వయంగా ఉదయం, సాయంత్రం నగరంలోని ఒక ప్రదేశంలో రిటైల్‌గా పాలను అమ్ముతాను. నేను సగటున నెలలో రూ.25 లక్షల విలువైన పాలను అమ్ముతాను’ అని చెప్పాడు.
పాలతో పాటు అక్షయ్ నెయ్యి, ఆవు పేడ నుంచి కూడా సంపాదిస్తున్నాడు. శీతాకాలంలో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు మూడు నెలల పాటు నెయ్యి తయారు చేస్తామని చెప్పాడు. దీనితో పాటు ప్రతి ఏడాది తన వద్ద దాదాపు 350 ట్రాలీల ఆవు పేడ ఎరువు కూడా ఉంటుంది. ఒక్కో ట్రాలీకి రూ.1600 చొప్పున ఆవు పేడ ఎరువును అమ్మడం ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన నిర్ణయంపై దృఢ విశ్వాసం, కృషితో విజయాన్ని ఒడిసి పట్టవచ్చని నిరూపించాడు అక్షయ్. ఆధునిక పద్ధతుల సహాయంతో సాంప్రదాయ పశుపోషణ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు. ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో గడిపేంత సమయాన్ని, కృషిని తన సొంత వ్యాపారాన్ని స్థాపించడానికి, దానిని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తే అద్భుతాలు సాధించవచ్చని అంటున్నాడు.. అక్షయ్. మూడేళ్లు.. కేవలం మూడేళ్లు.. మీరు నమ్మిన దాని కోసం ప్రయత్నించండి అని యువ వ్యాపారులకు సూచిస్తున్నాడు.
READ ALSO: MS Dhoni Angry Moment: కెప్టెన్ కూల్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు