మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అన్ని వైపుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వింటేజీ లుక్‌లో చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా డెహ్రాడూన్ స్కూల్‌లో పి.టి. మాస్టర్‌గా చిరంజీవి పిల్లలతో ఆయన పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ‘జై చిరంజీవ’, ‘అందరివాడు’ సినిమాల్లోని వింటేజ్ చిరంజీవిని మళ్ళీ చేస్తున్నామంటూ ఫ్యాన్స్ థియేటర్లలో ఈలలు వేస్తున్నారు.
Also Read : Cheekatilo : ఉత్కంఠ రేపుతున్న..శోభితా ‘చీకటిలో’ ట్రైలర్!
ఇక సినిమా సెకండాఫ్‌లో విక్టరీ వెంకటేష్ ‘వెంకీ గౌడ’గా ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు సాగే వీరిద్దరి కాంబినేషన్ సీన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ డ్యాన్స్ నెంబర్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో మెగా కోడలు ఉపాసన కొణిదెల తన మామయ్య సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
‘ఇది మెగా సంక్రాంతి.. కంగ్రాట్స్ మామయ్య’ అంటూ ఉపాసన ఎక్స్ (Twitter)లో పోస్ట్ పెట్టారు. ఈ సినిమాలో చిరంజీవి సిగరెట్ తాగుతూ స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చే సీన్‌ను షేర్ చేస్తూ, చిరు స్వాగ్‌కు తను ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, చిరు కుమార్తె సుస్మిత కొణిదెల ఒక నిర్మాతగా వ్యవహరించారు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా చిరంజీవి నటన, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా మెగా అభిమానులకు అసలైన పండగను తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
It’s a MEGA SANKRANTHI
hearty congratulations
Mamaya @KChiruTweets @NayantharaU @sushkonidela
❤️❤️❤️❤️❤️🧿🙌 pic.twitter.com/xFhxbcV8Sc— Upasana Konidela (@upasanakonidela) January 12, 2026