Upasana Konidela: ఆ బాధను నేను చూసాను.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ అపోలో హాస్పిటల్స్ పెద్దలకు మాత్రమే కాకుండా చిన్నారుల కోసం కూడా గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య రంగంలో అరుదైన సేవలను అందిస్తూ దేశం యావత్తు తనదైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిటల్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తాజాగా అపోలో హాస్పిటల్స్ చిన్న పిల్లల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించింది. నేడు ఈ అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగోను అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ “నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో అందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించటంతో పాటు ఆశీర్వాదాలను అందించారు. నా ప్రెగ్నెన్సీ జర్నీని అద్భుతమైన జ్ఞాపకంగా చేసిన మీ అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను.
అపోలో పీడియాట్రిక్, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అంతే ఉండదు. అలాంటి మధుర క్షణాలను తల్లిదండ్రులకు అందిస్తోన్న డాక్టర్స్‌కు ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నన్ను కలిసి వారి సలహాలను ఇచ్చేవారు. అయితే కొందరి మహిళలకు ఇలాంటి సపోర్ట్ దొరకదు. ఆ విషయం నాకు తెలిసి బాధవేసింది. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ పెద్దగా ఉండదు. కాబట్టి అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నేను వారికి నా వంతు సపోర్ట్ అందిచటానికి సిద్ధం. ఈ ప్రకటన చేయటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను” అని తెలిపింది. ఇక ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఉపాసనను ప్రశంసిస్తున్నారు.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!