Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Venkatesh Urges Youth to Say No to Drugs: డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అగ్ర హీరో వెంకటేష్ పిలుపునిచ్చారు. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు యువతే ప్రధాన బలమని, అలాంటి యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వెంకీ మామ అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ‘హైదరాబాద్ వాక్స్.. నషా ముక్త్ భారత్’ కార్యక్రమం కొనసాగనుంది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రను కిషన్ రెడ్డి చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విక్టరీ వెంకటేష్.. ఈ ఉద్యమాన్ని ఎంతో నిబద్ధతతో, నాయకత్వ పటిమతో ముందుకు తీసుకెళ్తున్న కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. డ్రగ్స్ రహిత భారతదేశం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Also Read
డ్రగ్స్ వినియోగం వల్ల యువత తమ ఆరోగ్యాన్ని, భవిష్యత్తును, చదువును కోల్పోతున్నారని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఎంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు బానిసలవుతున్న యువతను దూరం పెట్టకుండా వారికి అండగా నిలవాలని, వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలపడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. యువతకు సందేశమిస్తూ.. ‘మీ జీవితం ఎంతో విలువైనది. డ్రగ్స్‌కు బానిసలు కావద్దు. మేల్కొనండి. మీకు అండగా నిలవడానికి మేమందరం ఉన్నాం. తోటివారి ఒత్తిడికి లొంగిపోవద్దు. మీ లక్ష్యాలకు, భవిష్యత్తుకు డ్రగ్స్ అడ్డంకిగా మారనివ్వకండి’ అని సూచించారు.
తల్లిదండ్రులకు కూడా వెంకటేష్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. పిల్లలతో ఓపికగా మాట్లాడాలని, వారికి సమయం కేటాయించాలని కోరారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, ఆందోళనలను తల్లిదండ్రులు శ్రద్ధగా వినాలని సూచించారు. పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలని, అప్పుడే వారికి అవసరమైన సహాయాన్ని అందించగలమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలని వెంకటేష్ పిలుపునిచ్చారు. ‘డ్రగ్స్‌కు నో చెబుదాం.. జీవితానికి ఎస్ చెబుదాం. డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు’ అంటూ నినదించారు. వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వారి కోసం 14446 హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉందని గుర్తుచేశారు. సమస్యలు ఎదురైనప్పుడు సంకోచించకుండా ఇతరులతో మాట్లాడాలని, సహాయం కోరాలని యువతకు వెంకీ సూచించారు.
- Tags
తాజావార్తలు
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
-
Vrushakarma Trailer: నాగ చైతన్య కీ కామెంట్స్.. అందరి చూపు ‘వృషకర్మ’ ట్రైలర్‌పైనే!
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Varanasi: వారణాసిలో విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాదా..?
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
-
IPL 2027 Auction: వేలం బరిలో 1,220 మంది ఆటగాళ్లు.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో దిగ్గజ ఆటగాళ్లు.. పూర్తి లిస్ట్ ఇదిగో..
-
200MP + 200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీ, ARRI సినిమాటిక్ ఫీచర్లతో HONOR Magic9 Pro Max లాంచ్..!