UP Durga Puja: ఉత్తరప్రదేశ్ లోని భదోహి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దుర్గా పూజ జరుగుతున్న సమయంలో మంటలు అంటుకుని 62మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ముగ్గురు చనిపోయారు. ప్రతేడాది అట్టహాసంగా సాగే పూజలో ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడంతో భక్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. భదోహి-ఔరాయ్ రోడ్డులోని ఏక్తా క్లబ్ పూజా పండల్ వద్ద ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగడంతో పూజాపండలం కిక్కిరిసిపోయింది. కొద్ది నిమిషాల్లోనే వెదురు బొంగుల ఆధారంతో బట్టలతో చేసిన పూజా పండలం మొత్తం మంటలు వ్యాపించాయి.
Read Also: Cooking Oil: వంట నూనెల దిగుమతిపై కేంద్రం గుడ్ న్యూస్
పూజామండపం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రమాద బాధితుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు స్థానిక రక్షణ, సహాయక అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించేలోపే అక్కడ దాదాపు 60మందికి పైగా ఆ మంటలకు కాలి గాయలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం BHU మరియు SPG డివిజనల్ హాస్పిటల్ ఆఫ్ వారణాసికి రెఫర్ చేసినట్లు.. డివిజనల్ కమిషనర్ మీర్జాపూర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా తెలిపారు.
Read Also:Maharastra CM: మహారాష్ట్ర సీఎంకు ప్రాణహాని.. భద్రత కట్టుదిట్టం
షష్టి (ఆరవ రోజు) ఆచారాలను అందించిన తర్వాత నవరాత్రుల సప్తమి రోజున భక్తుల కోసం చాలా దుర్గా పూజా పాండల్స్ తెరవబడ్డాయి. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మంటలు కనిపిస్తున్నాయని స్థానికులు తెలిపారు.
Read Also:Anti-Hijab Protest: ఇరాన్ హిజాబ్ నిరసనల్లో 90 మందికి పైగా మృతి