Haircut: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారిననే గర్వంతో దుర్మార్గంగా వ్యవహరించాడు. తనకు హెయిర్ కట్ చేసేందుకు ఆలస్యంగా వచ్చాడని ఓ బార్బర్‌ని లాకప్‌లో ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు. సర్కిల్ ఆఫీసర్(సీఓ) సునీత్ కుమార్, బార్బర్ వినోద్ కుమార్‌ని జట్టు కత్తిరించడం కోసం తన ఇంటికి పిలిచిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన రాష్ట్రంలోని బదౌన్‌లోొ చోటు చేసుకుంది.
Read Also: China: సిక్కింకి 150 కి.మీ దూరంలో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించిన చైనా..
బాధితుడి సోదరుడు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వినోద్ ఇతర కస్టమర్లతో బిజీగా ఉన్నాడు, కాబట్టి అతను పోలీస్ అధికారి నివాసానికి చేరుకోవడంలో కొంచం ఆలస్యం అయింది. కొన్ని గంటల తర్వాత కొంతమంది పోలీసులు మా కటింగ్ షాపుకు వచ్చారు. షాపుని మూసేసి వినోద్‌ని బిసౌలీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. బుధవారం మధ్యాహ్నం వరకు వినోద్‌ని లాక్అప్‌లోనే ఉంచారు.’’ అని చెప్పారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ అలోక్ ప్రియదర్శి అన్నారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.