Prabhas Srinu : “రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది”.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Srinu : ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో స్థాయి పెరిగేకొద్దీ అహం, గర్వం కూడా పెరిగే అవకాశం ఉంటుందని, కానీ అలాంటి సమయంలో మనల్ని నేల మీద నిలబెట్టే వ్యక్తులు ఎంతో అవసరమని ఆయన అన్నారు. తనకు అలాంటి గొప్ప పాఠాలు నేర్పిన వ్యక్తి రాజమౌళేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఒక నటుడిగా మంచి పేరు రావడం మొదలైతే మనలో తెలియకుండానే కొంత గర్వం వస్తుంది. ‘ఇప్పుడు నేను ఎదుగుతున్నా’ అనే భావనతో పాటు అహం కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలో, ఎంత సింపుల్గా జీవించాలో రాజమౌళి గారిని చూసి నేర్చుకున్నాను” అని చెప్పారు.
‘విక్రమార్కుడు’ సినిమా రోజుల నుంచే రాజమౌళితో తనకు సన్నిహిత పరిచయం ఉందని ఆయన తెలిపారు. షూటింగ్ల మధ్య విరామ సమయంలో కూడా రాజమౌళి చాలా సాధారణంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో ఆయన బైక్పై షూటింగ్కు వచ్చేవారు. బ్రేక్ టైమ్లో సెట్లోనే ఎక్కడైనా గడ్డి మీద పడుకుని విశ్రాంతి తీసుకునేవారు. ఎలాంటి స్టార్ హంగులు ఆయనలో కనిపించేవి కావు” అని అన్నారు. రాజమౌళి ఇంటి వాతావరణం కూడా ఎంతో సాధారణంగా ఉండేదని చెప్పారు. హీరోలు, టెక్నీషియన్లు, డ్రైవర్లు అనే తేడా లేకుండా అందరూ ఒకే కుటుంబంలా కలిసి భోజనం చేసేవారని, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి కావని వివరించారు. అదే తనకు జీవితంలో గొప్ప పాఠంగా మారిందన్నారు. చిన్న విషయాలకే ఈగో పెంచుకోవడం సరైంది కాదని, ఏదైనా సమస్య ఎదురైతే ముందుగా కారణం తెలుసుకోవాలని రాజమౌళి జీవనశైలి ద్వారా నేర్చుకున్నానని ఆయన చెప్పారు. “మనకు ఒక విషయం నచ్చకపోతే వెంటనే స్పందించే బదులు, దాని వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. ఆ ఆలోచన నాకు రాజమౌళి గారిని చూసే వచ్చింది” అని పేర్కొన్నారు. ‘ఛత్రపతి’ సినిమా సమయంలో నుంచి రాజమౌళి ఇంటికి తరచూ వెళ్లేవాడినని, ఆయన పని చేసుకుంటుంటే తాము కింద కూర్చొని సరదాగా గడిపేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయనను దగ్గర నుంచి చూస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదని చెప్పారు. “రాజమౌళి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన మా అందరికీ గురువు. మా దృష్టిలో ఆయన దేవుడితో సమానం” అంటూ ప్రభాస్ శ్రీను తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..