తెలుగులో చాలా మంది హీరోలు వెబ్ సిరీస్ ల ద్వారా ఫెమస్ అయ్యి, సినిమాల్లోకి వచ్చిన వాళ్లే ఉన్నారు.. అందులో తాజాగా 30 వెడ్స్ 21 సిరీస్ తో ఫేమస్ అయిన చైతన్య రావు కూడా ఉన్నారు.. ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.. చైతన్య హీరోగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో రాబోతున్నాడు.. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా హనీమూన్ ఎక్స్‌ప్రెస్. తనికెళ్ల భరణి, సుహాసిని ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు..
ఇక ఈ సినిమాను బాల రాజశేఖరుని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు.. నిజమా.. నిజమా.. ఇది కనులు కలగాలి సాధ్యమా.. అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని కళ్యాణి మాలిక్ సంగీతంలో సింగర్ సునీతతో కలిసి ఆయన కూడా పాడారు. ఈ పాటని సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ రిలీజ్ చేశారు. పాట మెలోడిగా ఉంటూనే రొమాంటిక్ గా కూడా ఉంది. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా ఇందులో చైతన్య, హెబ్బా మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్ ను చూపించారు..
అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ బాల దర్శకత్వం వహించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలోని నిజమా సాంగ్ విన్నాను. చాలా మెలోడీగా ఉంది. చిత్రీకరణ, లొకేషన్స్ కూడా బాగున్నాయి. ఈ పాటను నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది.. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నాడు.. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమా. ఆర్జీవీ నా సినిమాలోని సాంగ్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు.. ఒకసారి ఆ సాంగ్ చూసేయ్యండి..