BJP Chargesheet: కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఆరు అబద్ధాలు-66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని .. హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధ్యం అయ్యిందన్నారు. తెలంగాణ ప్రజలు ఏ ఆశయాల కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారో.. ఆ ఆశయాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందన్నారు. కుటుంబ పాలన.. అహంకార పూరితంగా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పరిపాలన కూడా కొనసాగుతోందని విమర్శించారు. అబద్దాల హామీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించిందన్నారు. వంద రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ విఫలమైందన్నారు.
Read Also: CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారన్నారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ పాలన ఒకే విధంగా ఉందన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. అందుకే ప్రజల తరపున బీజేపీ ప్రశ్నించడానికి సిద్ధమైందన్నారు. 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి.. 9వ తేదీ మా అమ్మ సోనియా గాంధీ జన్మదినం రోజు రుణమాఫీ అని రేవంత్ అన్నాడన్నారు. ఇప్పటికీ ఏడాది పూర్తి కావస్తున్న ఇంకా పూర్తిగా రైతు రుణమాఫీ కాలేదన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో 500 వందల బోనస్ ఇస్తామన్నారని.. అధికారంలోకి వచ్చాకా కేవలం ధాన్యానికి మాత్రమే అన్నారని విమర్శలు గుప్పించారు. ఆ తరువాత సన్న బియ్యానికి అని మాట మార్చారన్నారు. మ్యానిఫెస్టోలో 10 రకాల పంటలకు 5 వందలు బోనస్ అన్నారని.. ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
Read Also: Preity Mukhundhan: సౌత్ ఇండస్ట్రీకి మరో క్రష్ దొరికేసిందోచ్!
రైతులు 500 బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని.. మూడు లక్షల వడ్డీ పంట రుణాలు అన్నారని.. దానికి అతి గతి లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి లీటరు పాలకు 5 రూపాయలు అన్నారు.. ఆ ఊసే లేదన్నారు. ఫార్మా సిటీకి వ్యతిరేకంగా అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పోరాటం చేసిందని.. ఇప్పుడు బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ వెళ్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా విడుదల చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బస్తీ పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పారని.. కానీ ఉన్న స్కూళ్లు మూసుకుపోతున్నాయి తప్పా ఒక్క స్కూల్ కూడా ఓపెన్ చేయలేదన్నారు.నాణ్యమైన ఆహారాన్ని కూడా స్కూళ్ళలో అందించలేకపోతున్నారన్నారు.
Read Also: Mohan Bhagwat : ప్రతి ఒక్కరూ ముగ్గురు పిల్లలను కనాలి.. లేదంటే చాలా ప్రమాదం!
అందుకే స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అవుతుందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు.. ఇంటర్ నేషనల్ స్కూల్స్ అందిస్తామన్నారు.. ఉన్న స్కూళ్లను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే 2 వేల పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తా అన్నాడు.. అప్పటి వరకు ఉన్న రూ.2 వేలు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, వితంతువులకు 4 వేలు ఇస్తామన్నారు.. వారి తరపున ఎప్పుడిస్తారని తాము అడుగుతున్నామన్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12 వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయాలని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ మహిళలకు 2500 రూపాయలు ఇస్తమన్నారని.. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.27,500 ప్రభుత్వం బాకీ పడిందన్నారు. ఆడపడుచులకు వివాహ కానుకగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ప్రకటించారన్నారు. ఇలా ఎన్నో హామీలు ప్రకటించి అమలుకు నోచుకోవడం లేని పరిస్థితి ఉందన్నారు. హుజూర్ నగర్‌లో బీజేపీ నీ ఓడించడానికి 10 లక్షల దళిత బంధును ప్రకటించాడు కేసీఆర్.. అందుకు మేమేమీ తక్కువా అని కాంగ్రెస్ 12 లక్షలు ప్రకటించిందన్నారు. కానీ ఇద్దరు దళితులను మోసం చేశారన్నారు. తెలంగాణ పదేళ్ళు అధికారంలో ఉంది ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ ఇవ్వలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ వచ్చి కూడా ఏడాది పూర్తి కావస్తుందని.. కాంగ్రెస్ కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా.. బి.ఆర్.ఎస్ బాటలోనే కాంగ్రెస్ వెళ్తుందన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “డబుల్ బెడ్రూంల పేరుతో అందని ద్రాక్షలా బి.ఆర్.ఎస్ మోసం చేసింది. అప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లన్నారు.. కానీ ఉన్న ఇండ్లను కూల్చి వేస్తున్నారు.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో హోం గార్డుల సమస్యలు తీరుస్తామన్నారు.. రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తా అన్నారు.. కానీ అమలుకు నోచుకోలేదు.. బెల్టు షాపులు బంద్ చేస్తామని చెప్పారు..ఇప్పుడు గాలికి వదిలేశారు. ఇండ్లు కూల్చకుండా మూసి ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నా.. భూ దందా కోసమే ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వస్తున్న ఆదాయానికి మించి అప్పులు చేసి దుబారా ఖర్చులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజల తరుపున హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.. హామీలను మరిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరు. నేను రాజకీయ పరమైన విమర్శలు చేయలేదు. ఎక్కిస్తా.. తొక్కిస్తా అని కేసీఆర్ మాట్లాడిన మాటలను రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయా అని ప్రజలు ఆలోచన చేయాలి. హామీల అమలుపై తెలంగాణ ప్రజలు నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హామీల అమలు పై రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధం. కేసీఆర్ భాషను వాడకుండా చర్చ కు వస్తానంటే ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధం. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1,2 ,3,4 నియామకాలు జరగలేదు. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేస్ కూడా పూర్తి కాలేదు. రైతులతో కూర్చొని చర్చించి సామరస్యంగా పరిష్కరించాలని కోరుతున్నాను. బలవంతంగా పోలీసులను అడ్డుపెట్టుకొని రైతుల నుండి భూములు లాక్కోవద్దు..ఇండస్ట్రీ లకు మేము వ్యతిరేకం కాదు.. ఫాం హౌస్‌లో కేసీఆర్‌తో సంబంధాలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అసలు కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్‌లో.. బీజేపీకి కేసీఆర్‌కి ఎలాంటి సంబంధం లేదు.” అని అన్నారు.