కొత్త భామలను ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడూ ఫస్ట్ లైన్‌లో ఉంటుంది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు ఇక్కడ అమ్మాయిల కన్నా.. ఇతర భాషామణులకు రెడ్ కార్పెట్ వేస్తుంది. అలా ఈ ఏడాదిలో మరో అరవిందం తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇలా వచ్చిన భామ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ చిన్నది.. లక్కీ గాళ్‌గా మారిపోయిది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు.. ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తుంది..? అనేది చూద్దాం. ఈ ఏడాది ఏ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన హర్రర్ కామెడీ ఓం భూమ్ బుష్. ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. జలజగా బెస్ట్ మార్క్స్ వేయించుకున్న అమ్మడు.. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్‌తో స్టార్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో ఒక్కసారిగా ప్రీతి ముకుందన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
Lal Salaam : ఓటీటీ కన్నా ముందే టీవీలో రజనీకాంత్ సినిమా?
తక్కువ టైంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ప్రీతిని.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో పిలిచి ఆఫర్ ఇచ్చాడు. ఇదే టైంలో తమిళంలో చేసిన ప్రైవేట్ ఆల్బమ్ ఆసా కూడా పాపులర్ కావడంతో ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్‌గా ఛేంజ్ అయ్యింది. ఏ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. అక్కడ సక్సెస్ కొట్టడంతో లక్కీ గార్ల్‌గా మారిపోయింది. తన టాలెంట్ ఫ్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతోన్న ఈ భామ.. ఓకే ఇండస్ట్రీకి స్టిక్ ఆన్ కావట్లేదు. సదరన్ సినీ ప్రపంచాన్ని ఏలేందుకు ఫిక్స్ అయ్యింది. అందం కన్నా టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మాలీవుడ్‌లో లెగ్ పెట్టింది ప్రీతి. మలయాళంలో మైనే ప్యార్ కియా అంటూ వస్తోంది. రామ్ కామ్ అండ్ మిక్స్ డ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న మూవీలో హిర్దో హరూన్ హీరోగా చేస్తున్నాడు. రీసెంట్లీ షూటింగ్ స్టార్టైన మైనే ప్యార్ కియా.. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. ఇదే కాదు కన్నప్ప కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు టూ హిట్స్‌తో లక్కీ గాళ్ గా మారిన అమ్మడు.. హ్యాట్రిక్ హిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తోంది. ఇందులో ఏ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా.. అమ్మడు గోల్డెన్ లెగ్‌గా మారిపోవడం ఖాయం.