NTV Telugu Site icon

Kishan Reddy: పేదల జోలికొస్తే ఖబర్దార్! .. హైడ్రా చర్యలపై కిషన్ రెడ్డి ఫైర్

Kishan Reddy Ujjaini Mahakali Temple

Kishan Reddy Ujjaini Mahakali Temple

మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా కల్పించారు మూసీ సుందరీకరణలో నిర్వాసితులవుతున్న కుటుంబాలను బాధితులను పరామర్శించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను స్వయంగా కలిసి, వారి గోడును ఆవేదనను విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని కేంద్ర అన్నారు. హైడ్రా పేరిట సర్కారు సాగిస్తున్న పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తోందని తెలిపారు. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కండ్లముందే చెదిరిపోతుంటే ప్రజలు గుండెబరువుతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు మార్క్ చేశారని, బాధిత ప్రజలు కేంద్రమంత్రికి గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు పేదల ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లు రావాలంటే… తమపై నుంచి పోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా పేద ప్రజలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

READ MORE: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓ కర్మ యోగి.. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..

మూసీ సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చివేసిందని, ప్రజలకు ప్రభుత్వం ఇవ్వకపోగా .. ప్రజలు తమ కష్టార్జితంతో ఒక్కో ఇటుక పేర్చుకుని కట్టుకున్న ఇండ్లను కులుస్తారా అంటూ మండిపడ్డారు. బస్తీలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదని.. గతంలో మాజీ సీఎం కేసీఆర్ మూసీ సుందరీకరణ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, హైడ్రా తరహాలోనే కూల్చివేతల కోసం ఇండ్లపై మార్కింగ్ చేశారని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామంటూ నాన్చివేత ధోరణితో మభ్యపెట్టి, ఒక్క పెదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాలన పోలేదన్నారు.

READ MORE:Samantha: దయచేసి చిన్నచూపు చూడకండి.. కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతామంటు గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. అయితే, నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందులో 50 వేల కోట్ల రూపాయల నిధులతో ఇల్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల ఇండ్లు కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదంటూ హెచ్చరిక జారీచేశారు. గతంలో అంబర్ పేటలో పేదల కోసం ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు నిర్మించి, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు రేషన్ కార్డులు ఇచ్చి హౌస్ నెంబర్లు కల్పించామని చెప్పారు. అయితే, అనేక సంవత్సరాల తర్వాత నేడు సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కూల్చేందుకు పూనుకుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పేదవాడి ఇంటిపై బుల్డోజర్ వస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. పేదవాడి సమాధులపై మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

READ MORE:Vizianagaram: రాడ్లతో టోల్గేట్ సిబ్బంది హల్చల్.. ఓ కారు డ్రైవర్పై దాడి

మూసీ నిర్వాసితుల పక్షాన నిలుస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన సంఘీభావ పర్యటనలో తమ సొంతింటిని కోల్పోతున్న వేలాది మంది జనాలు తరలి వచ్చారు. బిక్కుబిక్కుమంటూ హైడ్రా భయంతో బతుకీడుస్తున్నామని.. గుండెలు బాదుకుంటూ తమ ఆవేదనను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. హైడ్రా పేరుతో పేదల గూడు కూలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మూసీ నిర్వాసితుల పక్షాన బిజెపి అండగా ఉంటుందని, వారికి అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ కిషన్ రెడ్డి.. రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదలకు ఇండ్లు కట్టించాల్సిందిపోయి.. పేదల ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని, వారందరికీ అండగా ఉంటామని భరోసా కల్పించారు. కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడుతామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి భరోసాతో కిషన్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. అంబర్ పేట గుండెధైర్యం కిషన్ రెడ్డి అంటూ స్లోగన్స్ ఇచ్చారు.