Site icon NTV Telugu

Kishan Reddy: మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే..

Kishanreddy

Kishanreddy

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రిటైనింగ్ వాల్ కట్టాలి.. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి తెలిపారు. తాము కులగణనకు వ్యతిరేకం కాదని.. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలని కోరారు. తన డీఎన్ఏ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Ghaati: తలనరికి పట్టుకొచ్చిన అనుష్క.. ఘాటి గ్లింప్స్

త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ గెలువాలనే దృష్టిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మరోవైపు.. మూసీ పరివాహక ప్రాంతంలో బస చేస్తాం.. ఒకరోజు అక్కడే నిద్ర చేస్తాం.. అక్కడ ఉంటున్న వాళ్ళ ఇళ్లలో ఉంటాం, అక్కడే తింటామని పేర్కొ్న్నారు. అలాగే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బీజేపీ బృందాలు పర్యటిస్తాయని వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటినీ ఖతం చేస్తాం.. బీఆర్ఎస్ అవినీతి పై మోడీ స్వయంగా మాట్లాడారన్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ రాజకీయాలు లేవని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి అశ్విని వైష్ణవ్ వస్తారన్నారు. ఫ్లై ఓవర్లు, ఇతర ఇష్యూల పై సీఎంకి లేఖ రాస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also: Matrimonial Site Scam: మ్యాట్రిమోనిలో అమ్మాయిని వెతుకుతున్నారా? జాగ్రత్త సుమా!

Exit mobile version