Ghaati: తలనరికి పట్టుకొచ్చిన అనుష్క.. ఘాటి గ్లింప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుష్క శెట్టి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. UV క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా కాగా ఈ రోజు అనుష్క పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివిల్ చేశారు. ఫస్ట్ లుక్ అనుష్క పాత్ర యొక్క స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. పోస్టర్‌లో, అనుష్క తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది, ఆమె నుదిటిపై బిందీతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్ గా వుంది. ఇక గ్లింప్స్ చూస్తుంటే కన్నీటి కళ్ళు, నోస్ రింగ్స్, ఆమె పాత్ర ఇంటెన్స్ ని తెలియజేస్తూ, పాత్రపై క్యురియాసిటీని క్రియేట్ చేశాయి. గ్లింప్స్ లోని ప్రతి షాట్ అనుష్క జీవితంలోని కఠినమైన కోణాలను లోతుగా అన్వేషించే ఇంటెన్స్ ఫిల్మ్ ని సూచిస్తున్నాయి.
Vikkatakavi: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘వికటకవి’.. ట్రైలర్ కట్ చూశారా?
Also Read
బ్లడ్ షేడ్స్, ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, మనుగడ, పోరాటాన్ని అద్భుతంగా చూపిస్తున్నాయి. విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్‌లైన్‌తో, ఘాటీ సినిమా గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వుంటుందని అంటున్నారు, క్రిష్, అనుష్కను హై-ఆక్టేన్, యాక్షన్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌లో ప్రెజంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటి సినిమాలో టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటర్. చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఘాటీ’ ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!