Site icon NTV Telugu

Bihar: కేంద్ర మంత్రి మనవరాలిని కాల్చి చంపిన భర్త..

Bhihar

Bhihar

బీహార్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలిని ఆమె భర్త కాల్చి చంపాడు. పట్టపగలే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతమంతా కలకలం రేగింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి(32) 14 ఏళ్ల క్రితం రమేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ 14 ఏళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో నివిస్తున్నారు.

READ MORE: Ambati Rambabu : జగన్ రౌడీ అంటారు, సైకో అంటారు.. ఇచ్చిన హామీలు ముంచిన చంద్రబాబు చీటర్ కాదా

అయితే.. రమేష్ ఓ ట్రక్కు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సుష్మాదేవి వికాస్ మిత్రగా పని చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా ఏళ్లుగా హాయిగా సాగుతున్న వీరి కాపురంలో ఇటీవల గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరిగుతున్నాయని సమాచారం. బుధవారం ఆమెపై కోపంతో రమేశ్ బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెను బంధించి ఛాతి భాగంలో గన్‌తో కాల్చి పరారయ్యాడు. తీవ్ర రక్తశ్రావం జరగడంతో సుష్మా అక్కడికక్కడే మృతి చెందింది.

READ MORE: Nithya Menon: నిత్యా టాలీవుడ్‌ను మర్చిపోయిందా..?

ఈ ఘటనపై సమాచార అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మగధ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎస్పీ ఆనంద్ కుమార్ సుష్మను ఆమె భర్తే కాల్చి చంపాడని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని.. ఫోరెన్సిక్ టీమ్​, టెక్నికల్ సెల్​ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నటలు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.

READ MORE: Moto G Stylus 5G: మోటరోలా నుంచి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్.. ఫీచర్లు ఇవే!

Exit mobile version