కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు.మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు - ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.