ఢిల్లీ – దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఒకవైపు సైబర్ నేరాలను అడ్డుకుంటూనే మరోపక్క నేరస్థుల నుంచి రికవరీలు కూడా చేస్తున్నారు. దేశంలో సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ జరిగింది. అయితే రికవరీ అయిన సొమ్మును బాధితులకు రీఫండ్ చేసే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సులభతరం చేసే అంశంపై కేంద్రం యోచిస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుల్లో సైబర్ కమాండోల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని హోంశాఖ చెబుతోంది. సైబర్ నేరాలపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోంది.
Also Read:TTD: శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసం.. హైదరాబాద్ భక్తుడి వద్ద రూ. 90 వేలు వసూలు
సైబర్ మోసాల బాధితుల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేయడమే కాకుండా, 12 లక్షలకుపైగా సిమ్‌లు, మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసినట్లు చేశారు. మరోపక్క రూ.4631 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను అడ్డుకున్నారు. సైబర్ మోసాల్లో డబ్బు తరలించడానికి వాడే బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో నమోదు అయ్యే సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం ఢిల్లీ పోలీసులు e-zero FIR విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీ విధానంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేలా అధికారులు ప్లాన్ చెయ్యాలని హోంశాఖ చెప్తొంది.
Also Read:Mulugu: ములుగు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
భారత్ లో సైబర్ నేరాలను అరికట్టడంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కీలకంగా వ్యవహరిస్తోంది. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), 1930 – సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CFCFRMS), సైబర్ మల్టీ ఏజన్సీ సెంటర్ (CyMAC), రిపోర్ట్ & చెక్ సస్పెక్ట్ సౌకర్యం, సస్పెక్ట్ రిజిస్ట్రీ, సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సైబర్ కమాండోల ద్వారా సైబర్ నేరాల నియంత్రణ కోసం పనిచేస్తున్నాయి.కేంద్ర రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సామర్ధ్యాల అభివ్రుద్ధికి సైతం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, ప్రసార్ భారతి, ఆకాశవాణి ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు విస్త్రత అవగాహన కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. 1930 నంబర్ ను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ హెల్ప్‌లైన్ గా ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.