Tamannah : మరోసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న తమన్నా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో మొదలైన తన సినీ కెరీర్ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకుని బిజీ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రభాస్ తో బాహుబలి సినిమాలో నటించి ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ తరువాత ఈ భామ చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. రీసెంట్ గా బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లలో నటించింది.ఆమె నటించిన జీకర్థ, లస్ట్ స్టోరీస్ 2 రీసెంట్ గా ఓటీటీ లో విడుదల అయి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ సిరీస్ లలో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించి అందరికి షాక్ ఇచ్చింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి జోడీగా `భోళా శంకర్`లో సినిమాలో నటించింది.అలాగే తమిళంలో రజనీకాంత్ తో `జైలర్`సినిమా కూడా చేసింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలోనే ఆగస్టు నెలలో విడుదల కాబోతున్నాయి.అయితే ఈ సినిమాలు విడుదల కాకుండానే తమన్నా మరో క్రేజీ ఆఫర్ అందుకుందని సమాచారం..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో మరోసారి మిల్కీ బ్యూటీ నటించబోతుంది.గతంలో వీరిద్దరు కలిసి నటించిన `వీరం` ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో రిపీట్ కాబోతోందని సమాచారం.. తునివు హిట్ తరువాత అజిత్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఈ మూవీకి మొదట నయనతార భర్త విఘ్నేష్ శివన్ ను దర్శకుడిగా ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా కు ‘విడా ముయర్చి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఇంకా మొదలు అవ్వలేదు.. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. అయితే ఈ సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, షూటింగ్ పలు మార్లు వాయిదా పడటంతో త్రిష డేట్స్ ఖాళీగా లేవని సమాచారం.దాంతో ఈ సినిమా నుండి ఆమె తప్పుకున్నారు. మరి ఆమె స్థానంలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం.. అయితే ఈ వార్త పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
Also Read
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!