United Kingdom: యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య.. గగనతలం మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK air traffic control system: యునైటెడ్ కింగ్డమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్యతో పోరాడుతోంది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు, విమానాల్లో చిక్కుకున్న ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు బ్రిటన్‌లోని విమానయాన సంస్థలు చెప్పాయి. దీంతో దేశంలో విమాన సర్వీసులు ఆలస్యమవుతాయని స్పష్ట చేశాయి. ఇంజినీర్లు లోపాన్ని కనుగొని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని, దీని వలన కలిగే అసౌకర్యానికి తాము క్షమాపణలు కోరుతున్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. అయితే సాంకేతిక సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. సాంకేతిక సమస్య నేపథ్యంలో స్కాటిష్ విమానయాన సంస్థ లోగనైర్, ఈజీజెట్ విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రయాణికుల ట్విట్టర్ వేదికగా హెచ్చరించాయి.
Read Also: Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
అంతర్జాతీయ విమానాలు ఆలస్యం కావచ్చని విమానయాన సంస్థ హెచ్చరించింది. ఈ ఉదయం యూకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కంప్యూటర్ సిస్టమ్ నెట్వర్క్-వ్యాప్త వైఫల్యం జరిగిందని పేర్కొంది. ప్రస్తుతానికి యునైటెడ్ కింగ్డమ్లో విమానాల రాకపోకల విషయంలో ల్యాండింగ్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కానీ టేకాఫ్‌కు అనుమతి లేదు. సుధీర్ఘ వారంతపు సెలవులకు విదేశాలకు వెళ్లిన వారు ఎక్కువ సంఖ్యలో తిరిగి వస్తున్న సమయంలో విమాన సర్వీసులు ఆగిపోవడం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతారని ట్రావెల్ జర్నలిస్ట్ సైమన్ కాల్డర్ అన్నారు. ఇది ఎప్పుడు పరిష్కరించబడుతుందో కచ్చితంగా తెలియదన్నారు. సమస్యకు కారణాన్ని కూడా అధికారులు గుర్తించలేదని పేర్కొన్నారు. సమస్య ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి తాము సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తున్నామని ఈజీజెట్ ఎయిర్ లైన్ తెలిపింది.
కాగా, సాంకేతిక సమస్య వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ పని చేయడంలేదని బ్రిటన్ జాతీయ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ఎన్ఏటీఎస్) ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ఈ లోపాన్ని సరిచేసేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ నేపథ్యంలో తమ సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు బ్రిటన్‌కు చెందిన పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. అయినప్పటికీ సేవలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసేందుకు ప్రయత్నినట్టు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!