సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇవాళ( శుక్రవారం) ఇద్దరు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఇధ్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు ఛాన్స్ ఉంటుంది. తాజాగా ఇద్దరు న్యాయమూర్తుల చేరికతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది. కాగా, సుప్రీంకోర్టు కొలిజీయంలో మరో రెండు ఖాళీలు ఉన్నాయి.
జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. ఇటీవలే జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం వీరిద్దరికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర సర్కార్ కు సిఫారసులు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. దీంతో తాజాగా, వారు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.
Read Also: Maharashtra Politics: పంతాన్ని నెగ్గించుకున్న అజిత్ పవార్.. కీలక శాఖ పట్టేశాడు
1962 మే 6వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి జన్మించారు. ఏపీ హైకోర్టు జడ్జీగా సేవలు అందించిన ఆయన 2019లో కేరళ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. కాగా, ఈ ఏడాది జూన్ 1వ తేదీన కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1964 ఆగస్టు 2న జన్మించారు. గౌహతి హైకోర్టులో జడ్జీగా పని చేశారు. ఆ తర్వాత ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, గతేడాది జూన్ 29వ తేదీన ఆయన తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి పొందారు.
Justice Ujjal Bhuyan and Justice SV Bhatti take oath as judges of the Supreme Court. Chief Justice of India DY Chandrachud administers the oath to Justices Bhuyan and Bhatti.
(Pics: Supreme Court of India's YouTube) pic.twitter.com/UDOxXQPqY0
— ANI (@ANI) July 14, 2023