సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇవాళ( శుక్రవారం) ఇద్దరు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఇధ్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు ఛాన్స్ ఉంటుంది. తాజాగా ఇద్దరు న్యాయమూర్తుల చేరికతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది.