కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించారు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘యూఐ’ పేరుతో కొత్త సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి పెరిగిపోయింది. ఇక తాజాగా యూఐ మూవీకి తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు ఉపేంద్ర హైదరాబాద్ చేరుకున్నారు.’యూఐ’ సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తోంది. దీంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఉపేంద్ర ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారు.. తెలుగు వెర్షన్ కి డబ్బింగ్ చెప్పేందుకు ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఉపేంద్ర డబ్బింగ్ చెప్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఇక గతేడాది సెప్టెంబర్ లో ఉపేంద్ర తన పుట్టిన రోజు సందర్భంగా ‘యూఐ’ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ రెండు చూసిన తర్వాత ‘యూఐ’ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ‘అంతా చీకటిగా ఉంది. దీని నుండి ఎలా తప్పించుకుంటావు?’ అనే డైలాగ్తో ‘యూఐ’టీజర్ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం పలువురు యాక్టర్ల షాట్స్ మాత్రమే ఉన్నాయి. చివర్లో గుర్రంపై ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చారు. అలా ఈ సినిమాలో తన లుక్ ను రివీల్ చేసి ఉపేంద్ర సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.వర్చువల్ రియాలిటీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్ ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేశ్ మరియు మురళీ కృష్ణ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
#Upendra 𝗖𝗼𝗺𝗺𝗲𝗻𝗰𝗲𝘀 𝗗𝘂𝗯𝗯𝗶𝗻𝗴 for the #UITheMovie in Telugu in Hyderabad! pic.twitter.com/GNToU05qL3
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) February 8, 2024