Trump: అచ్చం అలాగే.. ట్రంప్‌పై దాడిని చిత్రీకరించిన ఆఫ్రికా చిన్నారులు.. వీడియో వైరల్
- ట్రంప్‌పై దాడిని తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించిన ఉగాండా చిన్నారులు
- వీడియో నెట్టింట వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump Assassination Attempt: ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై జరిగిన ఈ దాడిలో తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి తర్వాత ప్రపంచమంతా ఈ విషయంపై చర్చించింది. ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని కొంత మంది పిల్లలు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో, ఉగాండాలోని పిల్లలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును పునఃసృష్టించారు. ఈ వీడియోలో ఒక పిల్లవాడు ట్రంప్‌లా నటించగా.. మరికొందరు పిల్లలు ఆయన భద్రతా సిబ్బందిగా, ప్రేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నాటకీయ సన్నివేశంలో అచ్చుగుద్దినట్లు ట్రంప్‌పై దాడి జరిగిన విధానాన్ని వీడియో రూపంలో చూపించారు. కాల్పులు జరగగానే సెక్యూరిటీగా వ్యవహరించే పిల్లలు వేగంగా ట్రంప్‌లా నటించే పిల్లవాడిని చుట్టుముట్టి, సురక్షితంగా తీసుకువెళతారు. ఈ వీడియో జులై 13న పెన్సిల్వేనియాలో ర్యాలీ సందర్భంగా ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడిన నిజ జీవిత సంఘటన ఆధారంగా చిత్రీకరించారు.
Read Also: Bhole Baba: ‘‘పుట్టినవారు చావాల్సిందే’’.. హత్రాస్ తొక్కిసలాటపై భోలే బాబా కామెంట్స్..
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
🇺🇬CHILDREN IN UGANDA RECREATE TRUMP SHOOTING
Source: bloodofficial0 on TikTok pic.twitter.com/mVVaqXhdiV
— Mario Nawfal (@MarioNawfal) July 17, 2024
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!