Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకనాయకుడు కమల్ హాసన్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లలేదు. ఆ తర్వాత 2024లో భారతీయుడకు సీక్వెల్ గా ఇండియన్ 2ను తీసుకువచ్చాడు శంకర్. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. అసలే ప్లాప్స్ లో ఉన్న శంకర్ కు ఈ సినిమా మరింత నెగిటివిటీని తీసుకువచ్చింది. అయితే ఇండియన్ 2 టైమ్ లోనే ఈ సినిమాకు సిక్వీల్ గా భారతీయుడు 3 షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసాడు శంకర్.
పార్ట్ 2 డిజాస్టర్ కావడంతో ఇక పార్ట్ 3 ఉండదని అందరు అనుకున్నారు. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ భారతీయుడు 3ని రిలీజ్ చేయబుతున్నామని ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భారతీయుడు 3: వార్ మోడ్‘ నుండి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. “అవినీతిపై ఏమాత్రం సహనం లేని సేనాపతి మళ్లీ తిరిగివచ్చాడు.. సరికొత్త యుద్ధం మొదలైంది!” అంటూ చిత్రబృందం ప్రకటించింది. అయితే భారతీయుడు 2 రిలీజ్ ప్రమోషన్స్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ నేను ‘ భారతీయుడు పార్ట్ 3’కి పెద్ద అభిమానిని. కొందరు నాకు మొదటి భాగం ఇష్టమని, మరికొందరు రెండో భాగం ఇష్టమని అంటుంటారు కానీ నాకు ఇష్టమైనది మాత్రం ఇండియన్ 3. మరి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతోందో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
Also Read
- The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా 'ది ట్రైటర్స్'
- Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
- Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
- Srinidhi Shetty: 'ఆదర్శ కుటుంబం' డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!