హైదరాబాద్‌లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ మంగళవారం మాదాపూర్, ఉప్పల్ ప్రాంగణాల్లో ‘ఉగాది ఉత్సవాన్ని’ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం, నృత్య ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాదాపూర్‌లోని యాంఫీథియేటర్‌లో సాయంత్రం డాక్టర్ హిమబిందు కానోజ్ శిష్య బృందంచే కూచిపూడి ప్రదర్శన ‘రీతు శోభ’, అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకర శర్మ పాల్గొంటారు. ద్వారా ప్రకటనలు
కాగా, ఉప్పల్‌లో బ్రహ్మశ్రీ సోమనాథ శాస్త్రిచే పంచాంగ శ్రవణం, శ్రీమతి వాణి రమణ, శ్రీ చంద్రశేఖర్ విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. దీనికి తోడు సందర్శకులందరికీ ఉగాది పచ్చడి పంపిణీ చేస్తామని, రెండు చోట్ల ఫుడ్ కోర్టుల్లో సంప్రదాయ ఆహారాన్ని అందజేస్తామని శిల్పారామం సీనియర్ అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే.. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి. షడ్రుచుల ద్వారా సుఖదుఖాలకు, శాంతికి, సమృద్ధికి, బాధ్యతలకు, హక్కులకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని ముందుకు సాగించాలన్నది ఉగాది సందేశం. శ్రీ క్రోధి నామ సంవత్సరం కూడా మీ అందరి జీవితాల్లోకి సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, సమృద్ధి తీసుకురావాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా, వ్యవసాయం ఆధారంగా.. సనాతన ధర్మంలో పండుగలన్నీ జరిగేలా మన పూర్వీకులు నిర్ణయించారు. మన భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడం.. పండుగలను జరుపుకోవడంలోని అంతరార్థం. మన హక్కులను గుర్తుచేస్తూనే.. ప్రకృతిపట్ల, సమాజం పట్ల మన బాధ్యతలను మన పండుగలు గుర్తుచేస్తాయని, నవ వసంతం సమయంలో జరుపుకునే ఉగాది పండుగ కూడా ఇందులో ఓ భాగం. అందుకే మన పూర్వీకులు సూచించినట్లుగా సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఈసారి ఉగాది పండుగను జరుకుంటారని ఆకాంక్షిస్తున్నానన్నారు. వచ్చే నెల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్న సంగతి మీకు తెలిసిందే. ఈసారి పెద్ద సంఖ్యలో.. పోలింగ్ కేంద్రాలకు తరలిరండి. ఓటింగ్ శాతాన్ని పెంచాలని మిమ్మల్ని కోరుతున్నానని, మరోసారి మీ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.