COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు.
Read Also: PM Modi: మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు.. 44 కేసులు నమోదు చేసిన పోలీసులు..
దేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న మరణాల సంఖ్య 5,30,813కి చేరుకుంది. దేశంలో మొత్తంగా గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు 4.46 కోట్లు కేసులు నమోదు అవ్వగా.. వీరిలో 4,41,60,279 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.02 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది… రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 92.05 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 1,03,831 టెస్టులు చేశారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ కిం 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించారు.