కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈ సినిమా కు తెలుగు లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో లియోపై కూడా అదే స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా LCUలో భాగంగా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. విజయ్ దళపతి కి తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు లోకేష్ కూడా యాడ్ అవడంతో సినిమా పై అంచనాలు పీక్స్ కు చేరాయి.కాగా తాజాగా ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ చూశాడు. అనంతరం ఈ సినిమా గురించి ఓ ట్వీట్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉందని, లోకేష్ కనగరాజ్ టేకింగ్ చాలా ఎక్సల్లెంట్‌గా ఉందని, విజయ్ టెర్రిఫిక్‌గా పర్‌ఫార్మ్ చేశాడని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా చివర్లో LCU అని హ్యాష్‌ట్యాగ్ కూడా ఇచ్చాడు. దాంతో లియో సినిమా లోకేష్ సినిమాటిక్ యూనిఫర్స్‌లో భాగమే అని క్లారిటీ వచ్చేసింది. ఇంకేముంది సినీ లవర్స్‌లో ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కమల్ హాసన్‌తో విక్రమ్ తీసి తమిళనాట బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్.. ఇప్పుడు లియో సినిమా తో ఇంకెలాంటి విధ్వంసాలు చూపిస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. టిక్కెట్‌లు కూడా భారీగా అమ్ముడవుతున్నాయి. 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటించారు.