Jagga Reddy: పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావచ్చు.. జగ్గారెడ్డి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ చేరికల కమిటీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేశారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశించారు. పార్టీలో చేరే వారు బేషరతుగా పార్టీ లోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు పెద్ద మనసు చేసుకొని వారిని ఆహ్వానించాలని ఏఐసీసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచనలు చేసింది.
Read also: YS Bharathi Election Campaign: వైఎస్ భారతికి పులివెందుల బాధ్యతలు..
Also Read
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన ఇతర పార్టీ నాయకులు, పార్టీ విధి విధానాలు అర్థం చేసుకొని పార్టీలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు కూడా పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కలిసికట్టుగా పనిచేసి ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఓడించే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేపు ఉదయం నుంచి సాయంత్రం గాంధీ భవన్ లో చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చే నాయకులు మీ నియోజక వర్గ ఎమ్మెల్యే లకు గాని, నియోజక వర్గ ఇంచార్జ్ గాని, డీసీసీ అధ్యక్షులు సమాచారం ఇచ్చి గాంధీ భవన్ కు రాగలరని నాయకులకు సూచించారు.
Tihar Jail : తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!