Uber: ఉబర్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలకు చెక్.. వీడియో రికార్డింగ్ ఫీచర్ వచ్చేస్తోంది
- ఉబర్ యాప్‌లో వీడియో రికార్డింగ్ ఫీచర్
- ఇక ఆ కష్టాలకు చెక్
- ఉబర్ ప్రస్తుతం కొన్ని నగరాల్లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బైక్ ట్యాక్సీ యాప్ ఉబర్ తన డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది. భారత్ లోని తన డ్రైవర్ల కోసం ఉబర్ యాప్‌లో వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఈ ఫీచర్ ఉద్దేశ్యం ఏమిటంటే, డ్రైవర్లు ప్రయాణీకులు చేసే తప్పుడు ఫిర్యాదులు లేదా అనుచిత ప్రవర్తన నుండి తమను తాము రక్షించుకోవడంలో సహాయపడుతుంది. డ్రైవర్లు ఇప్పుడు ఉబర్ యాప్‌లో వీడియోలను రికార్డ్ చేయడానికి వీలుంటుంది. వివాదం తలెత్తినప్పుడు ఆధారాలను అందించొచ్చు. ప్రముఖ రైడ్-హెయిలింగ్ సర్వీస్ (ప్రయాణీకులను వారి స్థానం నుండి నేరుగా వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి మొబైల్ యాప్ ద్వారా ప్రైవేట్ డ్రైవర్లతో అనుసంధానించే ఆన్-డిమాండ్ రవాణా సేవ) అయిన ఉబర్ ప్రస్తుతం కొన్ని నగరాల్లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
Also Read:Bihar Election Results: బిహార్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ !
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఆరుగురు ఉబర్ డ్రైవర్లు మాట్లాడుతూ, తాము తరచుగా ప్రయాణీకుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ప్రయాణీకులు కొన్నిసార్లు తప్పుడు ఫిర్యాదులు దాఖలు చేస్తామని బెదిరిస్తారు. ఇటువంటి ఫిర్యాదుల ఫలితంగా డ్రైవర్లు జరిమానాలు లేదా ఖాతా సస్పెన్షన్లను ఎదుర్కొంటున్నారు. ఒక డ్రైవర్ ఇలా చెప్పుకొచ్చాడు. “రాత్రిపూట ప్రయాణించే కొంతమంది మహిళా ప్రయాణీకులు కొన్నిసార్లు మ్యాప్‌కు బదులుగా, వారికి నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటామని పట్టుబడుతున్నారు. మేము నిరాకరిస్తే, వారు తప్పుడు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు అని తెలిపారు.
కొత్త వీడియో రికార్డింగ్ ఫీచర్ క్లిష్ట పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి సహాయపడుతుందని డ్రైవర్లు అంటున్నారు. ఎందుకంటే వారి వద్ద ఇప్పుడు వీడియో ఆధారాలు ఉంటాయి. అయితే, వివాదం తలెత్తినప్పుడు కంపెనీ నిజంగా వారికి మద్దతు ఇస్తుందా లేదా అని కొంతమంది డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణీకులకు రికార్డింగ్ నచ్చకపోతే, వారు ఉబర్‌ను వదిలి వేరే క్యాబ్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చని వారు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం, ఈ ఫీచర్ బెంగళూరు, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, లక్నో, కోల్‌కతా, ముంబైలతో సహా 10 నగరాల్లో మాత్రమే ట్రయల్‌గా ప్రారంభించారు. డ్రైవర్ వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించినప్పుడల్లా, ప్రయాణీకుడికి “రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్” అని నోటిఫికేషన్ అందుతుంది. అన్ని రికార్డింగ్‌లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, డ్రైవర్ ఫోన్లో స్టోర్ చేయబడిందని, భద్రతా నివేదికలో యూజర్ వాటిని పంచుకుంటే తప్ప ఎవరూ, ఉబర్ కూడా చూడలేరని ఉబర్ పేర్కొంది.
డ్రైవర్ 7 రోజుల్లోపు రికార్డింగ్‌ను షేర్ చేయకపోతే, అది ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. ఈ ఫీచర్‌ను మొదట 2022లో USలో పరీక్షించారు. ఇప్పుడు కెనడా, బ్రెజిల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఫీచర్ Uber పాత ఆడియో రికార్డింగ్ ఫీచర్ ఆధారంగా రూపొందించారు. భారతదేశంలోని డ్రైవర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ మొదట కొన్ని నెలల పాటు ట్రయల్ ఫలితాలను గమనిస్తుంది, ఆ తర్వాత మాత్రమే ఇది పెద్ద ఎత్తున ప్రారంభించబడుతుంది.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!