Tirumala: తుఫాన్ ఎఫెక్ట్.. ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై తుఫాన్ ప్రభావం
- ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈవో శ్యామల రావు అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని… భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు ప్రకటించారు.
Read Also: AP CM Chandrababu: రతన్ టాటాకు నివాళిగా ఆయన పేరుతో హబ్.. సీఎం ట్వీట్
Also Read
వర్షాల కారణంగా టీటీడీ చరిత్రలో మొదటిసారిగా బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా ఉంచాలన్న ఆయన.. జేసీబీలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వేగంగా స్పందించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఈవో ఆదేశించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!