NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. వారెవరంటే?
- జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ మరొకరి అరెస్ట్
- గత నాలుగు రోజులుగా.. హజారీబాగ్‌లో నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసును విచారిస్తున్న సీబీఐ
- విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీక్ కేసులో జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను సీబీఐ ఈరోజు అరెస్ట్ చేసింది. డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్ నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్‌గా కూడా ఉన్నారు. విచారణ నిమిత్తం సీబీఐ హజారీబాగ్‌లోని చార్హి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంది. ఈ గెస్ట్ హౌస్‌లో సీబీఐ బృందం తొలుత ఎహసాన్-ఉల్-హక్‌ను విచారించింది. గత నాలుగు రోజులుగా, హజారీబాగ్‌లో నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసును సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోందని తెలిసిందే. బుధవారం ఒయాసిస్ స్కూల్లో విచారణ అనంతరం ప్రిన్సిపాల్ ఎహసాన్ ఉల్ హక్‌ను సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది.
READ MORE: Balakrishna: కలవడానికొచ్చిన అభిమానితో కలిసి భోజనం చేసిన బాలకృష్ణ
Also Read
వాస్తవానికి నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో బీహార్ పోలీసులు అరెస్టు చేసిన అభ్యర్థుల ఇంటి నుంచి సగం కాలిపోయిన పేపర్లను కనుగొన్నారు. అందులో ప్రశ్నపత్రం యొక్క ఫోటోకాపీలు కూడా ఉన్నాయి. దీని తర్వాత, బీహార్‌లోని ఆర్థిక నేరాల విభాగం (EOU) ఈ కాలిన పేపర్లను NTA అందించి.. అసలు ప్రశ్నపత్రంతో సరిపోల్చింది. ఇందులో సగం కాలిపోయిన పత్రాలలో 68 ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సమానంగా ఉన్నట్లు కనుగొనబడింది. తదుపరి విచారణలో పోలీసులకు దొరికిన ప్రశ్నపత్రాలు హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ బుక్‌లెట్‌తో సరిపోలినట్లు తేలింది. అప్పటి నుంచి ఒయాసిస్ స్కూల్‌పై సీబీఐ నిఘా పెట్టింది. ఈ విషయానికి సంబంధించి, ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్ పై EOU అనుమానం వ్యక్తం చేసింది. విచారణ అనంతరం నేడు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!