Twitter Shock to Films: సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో.. నష్టం కూడా అంతే ఉంది. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత క్రేజ్ గా ఫీలవుతుంటారు వాటి వినియోగదారులు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఏ సమాచారమైన చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. అది పాజిటివ్ కావొచ్చు.. నెగిటివ్ కావొచ్చు. సెలబ్రిటీలకు సంబంధించిన సమాచారమైతే ఇంకా వేగంగా స్ర్పెడ్ అవుతుంది. అందుకే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టాలంటే కొందరు ప్రముఖ సెలబ్రిటీలు జంకుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి భారీగా నష్టాన్నే తీసుకొస్తుంది. కొత్త సినిమా విడుదలైతే చాలు ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అది ఓ రేంజ్ లో ఉంటుంది. సినిమా పై ప్రచారం కూడా అంతేవిధంగా ఉంటుంది.
Read Also: Vadhandhi: విక్రమ్ వేద మేకర్స్ నుంచి వస్తున్న మరో థ్రిల్లర్…
ఇక ట్విట్టర్ లో మొదటి రోజే సినిమాలోని సీన్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు పైరసీ చేసి మరీ కొంతమంది తమ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సోషల్ మీడియానే సినిమాలను భయపెడుతోంది. ఇటీవల ఒక హాలీవుడ్ మూవీకి సంబంధించిన సీన్స్ ఒక యూజర్ పోస్ట్ చేయడం వైరల్ అయ్యింది. ట్విట్టర్ మాత్రం అలాంటి వీడియోలు లీక్ చేయడంపై రియాక్ట్ కావడం లేదు. ఎవరైనా సరే సినిమాల వీడియోలను అప్ లోడ్ చేస్తే నిబంధనల ప్రకారం కాపీరైట్ స్ట్రైక్ సిస్టమ్ అలెర్ట్ అయ్యి దాన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా సంస్థ చేయకపోవడంతో తీవ్రనష్టం వాటిల్లుతోంది. ట్విట్టర్ ను ఎలాన్ మాస్క్ చేజిక్కించుకున్న తరువాత చాలా మంది ఉద్యోగులు జాబ్ కు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఇక పలు కార్యాలయాలు కూడా మూత పడుతున్నాయి. ఎలాన్ మాస్క్ అనవసరమైన నిర్ణయాలతో ట్విట్టర్ ను మూత పడేలా చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ ట్విట్టర్ రిప్ అనే ట్యాగ్ కూడా వైరల్ అయ్యింది. ఇక త్వరలోనే మాస్క్ ట్విట్టర్ లో 40 నిమిషాల వరకు వీడియో అప్ లోడ్ చేసుకునే విధంగా మార్పులు చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. ఇక అలా జరిగితే మాత్రం సినిమాలకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు.