కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు సోదరీమణులు జన్మించారు. కర్ణాటకలో హాసన్ ప్రాంతానికి చెందిన ఈ కవల సోదరీమణులు చుక్కి, ఇబ్బని. వీరిద్దరూ జన్మించడంలో రెండు నిమిషాలు తేడా కావచ్చు. కాకపోతే వారు రాసిన పరీక్షల ఫలితాలు చూసి మాత్రం నిజంగా వారు కవలలని ఇట్లే తెలియని వారు కూడా చెప్పేస్తారు. అంతలా కరెక్ట్ గా ఇద్దరికీ 10,12 తరగతిలో ఒకటే మార్కులు రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Indira Gandhi: లోక్‌సభ ఎన్నికల బరిలో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు..
తాజాగా కర్ణాటకలో విడుదలైన 12వ తరగతి పరీక్షలలో 600 మార్కులకు గాను 571 మార్కులు ఇద్దరు సోదరీమణులు కరెక్ట్ గా సాధించారు. ఇది ఇలా ఉంటే రెండు సంవత్సరాల క్రితం వారు రాసిన పదో తరగతి పరీక్షల్లో కూడా 625 మార్కులకు 620 మార్కులు కరెక్ట్ గా సాధించారు. ఇది నిజంగా యాదృచ్ఛికమైన సన్నివేశం. ఇక ఈ విషయం సంబంధించి కవలలో పెద్ద అమ్మాయి అయినా చుక్కి మాట్లాడుతూ.. మాకు ఓకే మార్కులు ఎలా వచ్చాయో కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. తామిద్దరం 97% మార్కులను ఆశించామని అమ్మాయి చెప్పుకొచ్చింది. ఇక్కడ మార్కుల కంటే సంతోషితమైన విషయం ఏమిటంటే.. మాఇద్దరికి ఒకే మార్కులు సాధించడం ఆశ్చర్యకరంగా ఉందని తెలుపుతూనే.. ఇదివరకు పదవ తరగతిలో సమానమైన మార్కులు సాధించామని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తాము నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. వీరు కేవలం చదువులు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, అలాగే ఆటలలో కూడా వారి నైపుణ్యాలను కలిగి ఉన్నారు.
Also read: Alcohol: మద్యం తాగొద్దని సలహా ఇవ్వడమే నేరమైంది.. వ్యక్తి దారుణహత్య..
మీరు కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డిఆర్కె పియు కళాశాలలో సైన్స్ స్ట్రీమ్ లో 12వ తరగతిని పూర్తి చేశారు. ఇక నీటి పరీక్షల్లో తాము శాయశక్తులా ప్రయత్నించి మంచి ఉత్తీర్ణత సాధించాలని దానికి కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా మీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారా..? అని అడగగా.. కవలలో చిన్న ఆయన ఇబ్బని మాట్లాడుతూ.. నాకంటే మా అక్క ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎలా సంతోషిస్తాను నేను కూడా అంతే.. మేము పోటీ పడట్లేదు.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక వీరి తండ్రి వినోద్ చంద్ర ఈ యాదృచ్ఛిక మార్కులకు ఆయన ఆశ్చర్యపోయారు. తన కుమార్తెల రిజల్స్ పట్ల తాను గర్వంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.