Turmeric Cultivation : పసుపులో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం దేశంలో పండిస్తున్న వాణిజ్య పంటలలో ఒకటి పసుపు.. పసుపు తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఏడాది పొడవునా మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. అధిక లాభాలను కూడా పొందవచ్చు అందుకే ఎక్కువ మంది రైతులు పసుపు పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. పసుపు సాగు చేయాలనుకునే రైతులు పంట బాగా ఉండాలంటే ముందుగా విత్తన శుద్ధిలో జాగ్రత్తలు తీసుకోవాలి..దుంప తెగులు నుంచి కాపాడేందుకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి… పసుపులో వచ్చే దుంప తెగుళ్లు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం..
దుంప తెగులు సోకిన మొక్కలు ఆకులు పసుపు పచ్చగా మారి క్రమంగా ఎండిపోతాయి. ఇక ఆకులు మొదట ఆకుల చివరల నుండి ఎండడం ప్రారంభమయి ఆకు మొత్తం ఎండుతుంది. తెగులు సోకిన మొక్కల వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి. దుంపలు గోధుమ రంగుకి మారిపోయి క్రమంగా దుంప మొత్తం కుళ్ళిపోయి మెత్తగా తయారవుతుంది.. ఈ తెగుళ్లు అనేవి దుంపల ద్వారా, నీటి ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెందును.. అందుకే తెగులు వచ్చినప్పుడు ముందుగా చూసి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
నివారణ చర్యలు..
ప్రతి ఏడాది పసుపు పంట కాకుండా పంటను మార్చాలి.. ఇలా చెయ్యడం వల్ల తెగుళ్లు అనేవి సోకవు.. పసుపు, అల్లం పంటలను తేలికపాటి నేలలలో సాగు చేయాలి. మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి. ఆరోగ్యవంతమయిన దుంపలను నాటుకోవాలి. ఇకపోతే పసుపు కొమ్ములను విత్తన దుంపలను మెటలాక్సిల్3గ్రా./ లి. లేదా బోర్డో మిశ్రమం 1% మందు ద్రావణంలో 40 నిమిషాలు నానబెట్టి నాటుకోవాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి సంరక్షణ ఉంటుంది.. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీ క్లోరైడ్2% లేదా మెటలాక్సిల్ 0.25% మందు ద్రావణంను మొదళ్ళ వద్ద పోయాలి.. తెగుళ్లను తట్టుకొనే రకాలను నాట్టుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?