రాష్ట్రానికి, దేశానికి జగన్ మోడీ రాహుకేతువుల్లా తయారయ్యారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ గా దేశాన్ని బీజేపీ తయారుచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అప్పులుపాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడని, రాష్ట్రాన్ని జగన్ రుణాంద్రప్రదేశ్ గా మార్చాడని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తాలిబన్ల పాలనను మించిపోయిందని, మాఫియా రాష్ట్రంగా, డ్రగ్స్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని జగన్ మార్చేశాడని తులసి రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ పాలన అప్పులు ఫుల్, అవినీతి ఫుల్ గా మారిందని, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోడీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయని, ఈ మూడు పార్టీలను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈడినట్లే వుంటుందన్నారు. అంతేకాకుండా.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.
Vitamin D Deficiency : మహిళల్లో విటమిన్ డి లోపం ఉంటే…ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం..!