TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?
- టిక్కెట్ల విషయంలో భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ
- దర్శన సమయంలో తప్పుగా ప్రింట్
- ఉన్నతాధికారుల జోక్యంతో సమస్య పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srivani Darshan Timing Issue: తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్ల విషయంలో చోటుచేసుకున్న సాంకేతిక పొరపాటు భక్తులను తీవ్ర అయోమయానికి గురిచేసింది. దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు బదులుగా.. ఉదయం 4 గంటలుగా టిక్కెట్లపై ముద్రించడంతో పలువురు భక్తులు తెల్లవారుజామునే క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. అయితే అది శ్రీవాణి దర్శన సమయం కాకపోవడంతో.. టీటీడీ సిబ్బంది వారిని వెంటనే అనుమతించలేదు.
టిక్కెట్లలో ముద్రించిన సమయం ప్రకారం ఉదయం 4 గంటలకే క్యూ లైన్ వద్దకు చేరుకున్న భక్తులు దర్శనం కోసం ఎదురుచూశారు. కానీ ఆ సమయంలో శ్రీవాణి దర్శనం నిర్వహించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో భక్తులు టిక్కెట్లలో ఉన్న వివరాలను చూపిస్తూ.. టీటీడీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న టీటీడీ అధికారులు టిక్కెట్ ప్రింటింగ్లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు గుర్తించారు. సాయంత్రం 4 గంటలకు ఉండాల్సిన దర్శన సమయం పొరపాటున ఉదయం 4 గంటలుగా ముద్రించబడినట్లు నిర్ధారించారు. ఈ తప్పిదంతో భక్తులు అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
అనంతరం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. భక్తులు ఇబ్బందిపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్న టీటీడీ.. వారిని ఉదయం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి దర్శనానికి అనుమతించింది. దీంతో భక్తులు ఎట్టకేలకు శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం పొందారు. ఈ ఘటనతో శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల నిర్వహణలో టీటీడీ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?