తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నపై టీటీడీ ఈవో శ్యామల రావు గతంలో స్పందించారు.