Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి దర్శనం చేసుకునేందుకు టైం పడుతుందని టీటీడీ తెలిపింది. వీకెండ్, వేసవి సెలవులు రావడంతో స్వామిని దర్శించుకునే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, సర్వదర్శనం భక్తుల క్యూ లైన్ లతో మొత్తం నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర కొండపై భక్తుల క్యూ లైన్లు ఉంది.. ఏకంగా రింగురోడ్డు శిలాతోరణం సర్కిల్ దాకా వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.
Read Also: Stock Market: ఐదు రోజుల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
Also Read
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
కాగా, కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్న స్వామివారిని 64, 115 మంది భక్తులు దర్శించుకోగా.. 32, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4. 23 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండిపోయారు. కాగా, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అయితే, ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గృహాలు దొరకక పోవడంతో ఇబ్బందిగా మారింది. ఇక, క్యూలైన్లలో దర్శనం కోసం వేచి చూస్తున్న వారికి ఆహారం, తాగునీరు, పాలను టీటీడీ సిబ్బంది అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!