TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..
- పండుగల వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం..
- రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొన్న టీటీడీ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో త్వరలో జరగనున్న విశేష ఉత్సవాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) దర్శన వేళల్లో కీలక మార్పులు చేపట్టింది. ఈ నెలలో రానున్న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ మరియు ‘శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది’ పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
టీటీడీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం.. ఈ నెల 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 19వ తేదీన ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ రెండు ప్రధాన రోజుల్లో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. దీని ప్రభావం ముందు రోజు నుంచే ఉండనుంది. ముఖ్యంగా ఈ నెల 16, 18వ తేదీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే రికమండేషన్ లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
Also Read:Sajjala Ramakrishna Reddy: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండండి.. ఓట్లు తొలగించకుండా జాగ్రత్త..!
బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. అధికారిక హోదాలో వచ్చే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ తెలిపింది. కేవలం సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను మాత్రమే రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. సంప్రదాయం ప్రకారం ఉగాది వంటి పెద్ద పండుగలకు ముందు ఆలయ శుద్ధి కార్యక్రమం (తిరుమంజనం) నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 17న ఉదయం ఆలయ ప్రాంగణాన్ని పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్‌ను తాత్కాలికంగా తెరతో కప్పి ఉంచుతారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
Also Read:CM Revanth Reddy: ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!