Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ క్రికెట్లో ఆరంభం అంత సులభంగా సాగడం లేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ మంచి ఆరంభాలు లభించినప్పటికీ.. వరుసగా 13, 14 పరుగులకే అవుట్ అయ్యాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శామ్సన్ స్థానంలో వైభవ్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం అతని స్థానానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్ అనేది చాలా సవాల్‌తో కూడుకున్నదని ఈ మ్యాచ్‌లు నిరూపిస్తున్నాయి. రెండో టీ20లో విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుట్ అయిన వైభవ్.. మూడో టీ20లో జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతికి దొరికిపోయాడు.
ఈ యువ ఆటగాడి ప్రదర్శనపై ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ మొయిన్ అలీ ‘బియర్డ్ బిఫోర్ వికెట్’ (Beard Before Wicket) కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “జోఫ్రా ఆర్చర్.. వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. వైభవ్‌కు ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే.. రాబోయే రెండు, మూడు లేదా ఐదు మ్యాచ్‌ల్లో అతను పరుగులు చేయకపోతే అది పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ అతను చాలా ప్రతిభావంతుడని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం అతను అవుట్ అవుతున్న విధానాన్ని బట్టి అది అతని బలహీనత అని నేను అనుకోను. గతంలో ఇలాంటి షార్ట్ బంతులను అతను సిక్సర్లుగా మలచడం నేను చూశాను. అతని గురించి నాకు ఎలాంటి ఆందోళన లేదు, మిగిలిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల గురించే ఆలోచించాలి” అని మొయిన్ అలీ అన్నాడు.
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
అయితే, ఈ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మాత్రం.. ఐపీఎల్ (IPL) ద్వారా సేకరించిన డేటా తమకు ఎంతగానో సహాయపడుతోందని తెలిపాడు. “అతను అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి ఎక్కువ కాలం కాలేదు. కానీ ఐపీఎల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అతడిని చూశారు. కాబట్టి మాకు కావాల్సిన డేటా సులభంగా దొరుకుతుంది. మా టీమ్ మేనేజ్మెంట్ అతను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ బలంగా ఉన్నాడు అనే విషయాలను విశ్లేషించింది. ఒక బౌలింగ్ యూనిట్‌గా మేము ఆ ప్లాన్స్‌ను మైదానంలో అమలు చేస్తున్నాం” అని రషీద్ చెప్పాడు. “కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడటం వల్ల అతనిపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. మేము ప్రతి ఆటగాడిపై ప్రత్యేక ప్రణాళికలతో సీరియస్‌గా బరిలోకి దిగుతున్నాం. ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్ అతనికి ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పి ఉంటుంది. అయితే సిరీస్ ముందుకు సాగుతున్న కొద్దీ, వేర్వేరు పరిస్థితుల్లో ఆడేటప్పుడు ఫామ్ కోల్పోతే ఎలా సర్దుబాటు చేసుకోవాలనేది అతను నేర్చుకోవాలి. ప్రస్తుతానికైతే భారత్ అతనికి పూర్తి లైసెన్స్ (స్వేచ్ఛ) ఇచ్చినట్లు కనిపిస్తోంది” అని ఆదిల్ రషీద్ విశ్లేషించాడు.
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?