School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Bandh: తెలంగాణ రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిని కేవలం 4 వేలకు కుదించాలని ప్రభుత్వం భావిస్తోందని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించేందుకు బలమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
దీంతో పాటు విద్యారంగంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలను కూడా ఈ బంద్ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు తెరపైకి తెచ్చాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాయి. అలాగే అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని, ఇంటర్ కళాశాలల్లో తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని స్పష్టం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తూ.. అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్న తీరుపై మండిపడుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయించడాన్ని అడ్డుకోవాలని, అలాగే నూతన విద్యా విధానాన్ని (NEP) రాష్ట్రంలో అమలు చేయడం లేదని అసెంబ్లీలో తీర్మానం చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ డిమాండ్లన్నింటి సాధన కోసమే శుక్రవారం విద్యాసంస్థల బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగానే స్పందించాయి. శుక్రవారం నాడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు గురువారం మధ్యాహ్నం నుంచే సందేశాలు పంపాయి. శుక్రవారం బంద్, శనివారం రెండో శనివారం సెలవు, ఆపై ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసి రానున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!