TSRTC: టీఎస్‌ఆర్టీసీకి భారీ ఆదాయం.. 11 రోజుల్లోనే రూ.165.46 కోట్ల రాబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బస్సులకు విశేష ఆదరణ లభించింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది.
CS Review on Kantivelugu: కంటి వెలుగు అమలుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
గతేడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా ప్రయాణించగా.. ఈ సంక్రాంతికి 11 రోజుల్లోనే మొత్తంగా రూ.165.46కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనంగా ఆదాయం లభించింది. ఈ సంక్రాంతి సందర్భంగా 3.57 కోట్ల కిలోమీటర్ల టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయని, గతేడాదితో పోలిస్తే 26.60లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయని తెలిసింది. గతేడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ భారీగా పెరిగింది. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్) 59.17గా ఉంటే.. ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగింది. సాధారణ ఛార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులను నడపడం వల్ల ప్రయాణికులకు నమ్మకం పెరిగిందని సజ్జనార్ తెలిపారు.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..