Group-1 Exam: నేడే గ్రూప్-1 పరీక్ష.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత హోదాగా భావించే గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ ఎక్సామ్ స్టార్ట్ కానుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో గత అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దైంది. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షను ఇవాళ తిరిగి నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. నేటి ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించనుంది. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసిన కమిషన్… పరీక్షను సక్సెస్ పుల్ గా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
Read Also: Cyclone Biparjoy: తీవ్రమైన బిపర్ జోయ్ తుపాన్.. రానున్న 24గంటలు జాగ్రత్త
Also Read
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
అయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను కమిషన్ రద్దు చేసింది.
Read Also: Karnataka : భర్తపై భార్య అత్యాచారం కేసుపై స్టే విధించిన హైకోర్టు..
ప్రిలిమినరీ పరీక్షను మరోసారి నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు సైతం మరింత కఠినంగానే సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రానికి 3,00,836 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. 33 జిల్లాల పరిధిలో 994 కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. ప్రతి జిల్లా కలెక్టర్‌ను జిల్లా అథారిటీగా కమిషన్ బాధ్యతలు అప్పగించింది. కాగా, పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.
గ్రూప్-1 ప్రిలిమినరి రాసే అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో హాజరుకావాలి.. అలాగే హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా లేకుంటే మూడు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన హాల్‌టికెట్‌తో హాజరుకావాలి.. అభ్యర్థులు తప్పకుండా గుర్తింపు కార్డు (పాన్, ఆధార్, ఓటర్ ఐడీ తదితరాలు)ను వెంట తెచ్చుకోవాలి అని చెప్పారు.
Read Also: Viral News : బాత్రూమ్లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. చివరికి లెటర్ తో..
పరీక్షా హాల్లోకి అభ్యర్థులను అనుతించే విషయంలో టీఎస్పీఎస్సీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు వేసేస్తామని చెప్పారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.. అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకోవాలి.. బూట్లు వేసుకోకుడదు.. బెల్టు ధరించిన అభ్యర్థులను సైతం పక్కాగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు.. పరీక్ష తీరును పరిశీలించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు కమిషన్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!