Kshama Bindu: తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా బిందు .. గ్రాండ్ గా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్..వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kshama Bindu : తనను తాను పెళ్లి చేసుకుని సంచలనంగా రేపిన గుజరాత్ అమ్మాయి క్షమా బిందు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. గత ఏడాది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో చాలా మంది వాటిని చూస్తూ ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేసింది.. పిచ్చిదేమో.. లేక ఫెమస్ అవ్వాలనో అంటూ రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంది.. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.. తాజాగా ఆమె మొదటి పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోల ను సోషల్ మీడియాలో వదిలింది.. దాంతో మళ్లీ ఆమె పేరు వార్తల్లో మోగుతుంది..
విషయానికొస్తే.. గుజరాత్ వడోదరకు చెందిన క్షమా బిందు జూన్ 8, 2022 లో తనను తాను పెళ్లి చేసుకున్న యువతిగా సంచలనం రేపింది. పెళ్లి తరువాత సింగిల్‌గానే హనీమూన్ కి కూడా వెళ్లి ఎంజాయ్ చేసింది. కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఆమె పెళ్లి వేడుకను ఘనంగా చేసుకుంది.. అయితే రీసెంట్‌గా క్షమా బిందు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది…
Also Read
ఆ వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.. మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియోలో తన పెళ్లికి సంబందించిన ఫోటోలను, వీడియోలను షేర్ చెయ్యడం తో పాటు పెళ్లి తర్వాత తను ఎలా గడిపింది అనే వీడియోను కూడా సోషల్ మీడియాలో ద్వారా పోస్ట్ చేసింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ‘వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని కామెంట్లు పెడుతున్నారు. గ్రేట్, సూపర్ అంటూ రకరకాల కామెంట్స్ ను అందుకుంటుంది.. కొంతమంది పిచ్చి పదిరకాలు అందులో ఇది కూడా ఒకటి అని దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు.. మొత్తానికి తనను తానే పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా సంతోషంగా ఉందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!